ఫ్యాన్ వల్లే చావాలనుకుంటోందట

పెళ్లికి రెడీ అయిన హీరోయిన్ ఎలా ఉంటుంది.. గాల్లే తేలుతూ ఉంటుంది… పెళ్లి షాపింగ్ తో బిజీగా ఉంటుంది. మరోవైపు ఫ్రెండ్స్ కు ప్రతి రోజూ పార్టీలు.. ఆ ఉత్సాహం-ఊపు ఓ లెవెల్లో ఉంటాయి. కానీ ఇక్కడో హీరోయిన్ మాత్రం ఓవైపు పెళ్లి పెట్టుకొని మరోవైపు తనకు ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయంటూ ప్రకటించింది. దీనికి కారణం ధనుంజయ్ సింగ్. ఆ హీరోయిన్ పేరు రాణి ఛటర్జీ.

భోజ్ పురి సినిమాలతో బాగా పాపులరైన ఈ హీరోయిన్.. ధనుంజయ్ సింగ్ తనను వేధిస్తున్నాడని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈ ధనుంజయ్ సింగ్ ఎవరో తెలుసా.. ఇతడు స్టార్ కాదు, కనీసం సెలబ్రిటీ కూడా కాదు. కేవలం ఈ హీరోయిన్ కు ఓ అభిమాని. అతడు చేస్తున్న పనుల వల్ల తను మానసికంగా కుంగిపోతున్నానని అంటోంది రాణి.

రోజూ పిచ్చిపిచ్చి పోస్టులు పెడుతున్నాడట ధనుంజయ్ సింగ్. తన వ్యాఖ్యలతో రాణి ఛటర్జీని వేధించుకొని తింటున్నాడట. ఒక టైమ్ లో ఆ కామెంట్స్ చూసి తనకు ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తున్నాయని చెబుతోంది ఈ బ్యూటీ.

ఈ వ్యవహారంపై ఆమె ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సదరు హీరోయిన్ పేరు ప్రస్తావించకుండా కామెంట్స్ చేస్తున్న అతడిపై ఎలా చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆ కామెంట్స్ అన్నీ తన గురించే అంటోంది రాణి. 

Related Stories