నటాషా ఇష్టం: శృతిహాసన్

బ్యూటిఫుల్ హీరోయిన్ శృతిహాసన్ మరోసారి తన మనసులో మాట బయటపెట్టింది. మనిషిగా కాకుండా ఏదైనా జంతువుగా పుట్టాల్సి వస్తే ఆక్టోపస్ గా పుట్టాలని ఉందని చెప్పుకొచ్చింది. వీటితో పాటు మరికొన్ని హైలెట్స్ ఫటాఫట్ చూద్దాం.

ఎలాంటి సందర్భాల్లో అబద్ధాలు ఆడడం ఇష్టం ఉండదు?
ఎదుటి వ్యక్తిని సంతోషంగా ఉంచేందుకు అనవసరంగా అబద్ధాలు అడడం ఇష్టం ఉండదు.

శృతిహాసన్ కాకుండా ఇంకో పేరు పెట్టుకోవాల్సి వస్తే..?
ఇంకో పేరు పెట్టుకోవాల్సి వస్తే నటాషా అని పెట్టుకుంటాను. ఎందుకో ఆ పేరంటే నాకు చాలా ఇష్టం.

టైమ్ మెషీన్ ఎక్కితే ఏం చేస్తారు?
టైమ్ మెషీన్ దొరికితే గతంలోకి వెళ్లే కంటే, భవిష్యత్తులోకి వెళ్లడానికే ఇష్టపడతాను. గతించింది ఆలోచించకూడదు.. ముందుకు వెళ్తుండాలి.

ఏ విషయంలో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు?
టాటూస్, డ్రెస్సింగ్ విషయంలో ఎక్కువగా ఆలోచించను, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటాను.

ఒకవేళ జంతువుగా మారాల్సి వస్తే?
ఓ జంతువుగా మారాల్సి వస్తే సింహంగా మారతాను, ఆక్టోపస్ గా కూడా మారిపోవాలని ఉంది. ఈ రెండూ నాకిష్టం.

పిలిచే ముద్దుపేర్లలో వెరైటీగా అనిపించేది?
నన్ను పిలిచిన ముద్దుపేర్లలో నాకు కొత్తగా అనిపించిన పేరు ”శృటి”. కొంతమంది నన్ను అలా పిలుస్తారు.

More

Related Stories