సింగిల్ గా మాల్దీవుల్లో రష్మీ!


రష్మీ గౌతమ్ కి పెళ్లయిందా లేదా అనేది ఒక మిస్టరీ. ఆమెకి ఆల్రెడీ పెళ్లి అయిందని, కానీ భర్తతో విబేధాల కారణంగా ఒంటరిగా ఉంటోందని ఒక ప్రచారం ఉంది. మరోవైపు, సుడిగాలి సుధీర్ తో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి కూడా రకరకాలుగా పుకార్లు.

ఇవన్నీ ఎలా ఉన్నా ఆమె ఎప్పుడూ ‘సింగిల్’గానే కనిపిస్తుంది. భర్తతో ఎప్పుడూ కనిపించలేదు. తన పెళ్లి గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఇక తాజాగా ఆమె మాల్దీవుల్లో విహరిస్తోంది. సాధారణంగా మాల్దీవులకు పెళ్లైన వారు తమ భాగస్వామితో వెళ్తారు. పెళ్లికానీ వారు బాయ్ ఫ్రెండ్ తోనో, గాళ్ ఫ్రెండ్ తోనో వెళ్లడం చూస్తుంటాం. ఎందుకంటే మాల్దీవులు ఫ్యామిలీ వెకేషన్ కన్నా రొమాంటిక్ వెకేషన్ కి ఫేమస్. సింగిల్ గా వెళ్లేవారు అరుదు.

రష్మీ మాత్రం సింగిల్ గానే వెళ్ళింది. తోడుగా ఒక మిత్రురాలు కూడా ఉన్నట్లుంది. ఆమెకి జంటగా ఎవరూ లేరు.

రష్మీ గౌతమ్ ప్రస్తుతం మాల్దీవుల వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. ఐతే, ఆమె అభిమానులు మాత్రం బికినీ ఫోటోలు కావాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

 

More

Related Stories