రష్మీకి భారీగానే ముట్టిందట!


రష్మీ గౌతమ్ కి హీరోయిన్ గా అవకాశాలు రావట్లేదు. సినిమాల్లో ఆమె కనిపించి చాలా కాలమే అయింది. బుల్లితెరపై మాత్రమే దర్శనమిస్తోంది. అలాంటి భామని ఏరికోరి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో తీసుకున్నారు. ‘భోళా శంకర్’ అనే సినిమాలో ఆమె ఐటెం సాంగ్ చెయ్యనుంది. ఈ పాటకి ఆమెకి ముట్టే మొత్తం తక్కువేమి కాదు.

సినిమాల్లో ఆఫర్లు లేకున్నా… ఆమె ఈ పాట కోసం భారీగా డిమాండ్ చేసిందట. నిర్మాతలు కూడా ఎక్కువ ఆలోచించకుండా ఆమె అడిగిన అమౌంట్ ని ఇస్తున్నారు. హీరోయిన్ గా ఆమె తీసుకున్న పారితోషికం దానికన్నా ఐటెం సాంగ్ కి ఎక్కువ అందుతోందని టాక్.

‘భోళాశంకర్’లో హీరోయిన్ల సంఖ్య ఎక్కవే. చిరంజీవి సరసన మిల్కీబ్యూటీ తమన్న నటిస్తోంది. ఆయనకి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ కనిపిస్తుంది. తాజాగా ఐటెం గర్ల్ గా రష్మీ వచ్చి చేరింది.

మహతి సాగర్ సంగీతంలో రానున్న ఈ ఐటెం సాంగ్ ని వచ్చే ఏడాది చిత్రీకరిస్తారు. చిరంజీవి, రష్మీ గౌతమ్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి. ఆమెకి ఇదే ఫస్ట్ ఐటెం సాంగ్.

Advertisement
 

More

Related Stories