రష్మీ గౌతమ్ పెళ్లి అయిందా?


రష్మీ గౌతమ్ – సుధీర్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ రచ్చ జరుగుతుంటుంది. కానీ, తమ మధ్య స్నేహం తప్ప వేరే ఏమీ లేదని వారిద్దరూ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇక, ఇప్పుడు ఇండస్ట్రీలో మరో మాట వినిపిస్తోంది. రష్మీ గౌతమ్ లాక్ డౌన్ లో రహస్యంగా పెళ్లి చేసుకొందట.

తెలుగుసినిమా.కామ్ కి ఎక్స్ క్లూజివ్ గా తెలిసిన సమాచారం ప్రకారం రష్మీ గౌతమ్… సినిమా ఇండస్ట్రీకి, గ్లామర్ ప్రపంచానికి సంబంధం లేని వ్యక్తిని పెళ్లాడిందట. ఐతే, ఈ విషయాన్ని ఆమె ఎందుకు గోప్యంగా ఉంచుతుందో మాత్రం తెలియదు అని అంటున్నారు ఆమె సన్నిహిత వర్గాలు.

రష్మీ గౌతమ్ కి హీరోయిన్ గా ఇప్పుడు ఆఫర్లు లేవు. ఆమె పూర్తిగా బుల్లితెరపైనే ఫోకస్ పెట్టింది. అక్కడ స్టార్ గా వెలుగొందుతోంది. పెళ్లయిన భామలకు కూడా ఇప్పుడు క్రేజ్ అలాగే ఉంటుంది. ఒకప్పటిలా పెళ్లి ఐతే అవకాశాలు పోతాయనే పరిస్థితి లేదు. మరి నిజంగా ఆమె పెళ్లి చేసుకొని ఉంటే ‘అవకాశాలు పోతాయినే’ కారణంతో మాత్రం దాచాల్సిన అవసరం లేదు.

పెళ్ళై ఇద్దరూ పిల్లలున్న అనసూయ నటిగా కూడా బిజీగా ఉన్నారు కదా. సో…. రష్మీ గౌతమ్ ఈ విషయంలో క్లారిటీ ఇస్తారా అనేది చూడాలి.

 

More

Related Stories