రష్మీ… మరో అమల!

Rashmi Gautam

జీవ హింసకి వ్యతిరేకంగా పోరాడే మహిళ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు… అమల. ఒకప్పుడు వీధి కుక్కల సంరక్షణ విషయంలో ఆమె పెద్ద ఎత్తున పోరాడారు. ఆ తర్వాత ఎవరు జీవహింసకి వ్యతిరేకంగా మాట్లాడినా మరో అమల వచ్చిందిరోయ్ అనడం కామన్ అయింది.

తాజాగా రష్మీ గౌతమ్ ఈ లిస్ట్ లో చేరింది. ఆమె చాలా కాలంగా ఈ పోరాటం సోషల్ మీడియాలో చేస్తోంది. ఒక డాక్టర్ సంక్రాంతి కోడి పందాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఈ భామ ఘాటుగా స్పందించింది. ఆ డాక్టర్ డిగ్రీని మురికి కాలవలో పడెయ్యండి అని సమాధానం ఇచ్చింది.

దాంతో, ఆమెకి పలువురు గట్టిగానే ఆమెకి ట్వీట్స్ పెట్టారు. ‘కోడికి లేని బాధ మీకెందుకు. ఇది గర్వం కాదు…. మా సంప్రదాయం,” అంటూ మరొకరు మాట్లాడారు. దానికి ఆమె ఇంకా ఘాటుగా రిప్లై ఇచ్చింది. ‘‘కోడికి బాధ లేదని మీకు ఎలా తెలుసు?,” అని అడిగింది.

అంతేకాదు, కోడిపందాలు అనేది సంప్రదాయం ఐతే గ్లాడియేటర్ కాలం పోటీలు (మనుషుల మధ్య పందాలు) మళ్ళీ నిర్వహించండి. అవి కూడా ఒకప్పటి సంప్రదాయమే అంటూ ఈ భామ వాదిస్తోంది.

 

More

Related Stories