ఎవరి కోటా వాళ్ళకుంది: రష్మీ

Rashmi Gautam

ఒక రెండేళ్లు హీరోయిన్ గా హల్చల్ చేసింది రష్మీ గౌతమ్. చారుశీల, గుంటూరు టాకీస్, తను వచ్చేనంట, నెక్స్ట్ నువ్వే… వంటి సినిమాలతో కరోనాకి ముందు హంగామా చేసింది. ఐతే, ఇప్పుడు ఆమెని హీరోయిన్ గా తీసుకునేందుకు దర్శక, నిర్మాతలు సంప్రదించడం లేదు.

ఇటీవల ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ చిత్రంలో కనిపించింది. చిన్న పాత్ర. కానీ అది కూడా ఆడలేదు. హీరోయిన్ గా పాపులర్ అయిన ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రం ఎందుకు నిలదొక్కుకోలేకపోయింది? ఇదే ప్రశ్నని ఆమెని అడిగితే ఆమె చెప్పిన సమాధానం ఆసక్తికరంగా ఉంది.

“ఇక్కడ (ఫిలిం ఇండస్ట్రీ) ఎవరి కోటా వాళ్లకు ఉంది. ఎవరు క్యారక్టర్ చెయ్యాలో కూడా ఒక రూలు రాసి పెట్టి ఉంటుంది. చెల్లి, తల్లి పాత్రలు కూడా కొందరికే అవకాశాలొస్తాయి,” అని చెప్పింది.

ఇన్ డైరెక్ట్ గా తమ ‘క్యాంప్’లో ఉండే వాళ్ళకే దర్శక, నిర్మాతలు ప్రాధాన్యం ఇస్తారు అని అంటోంది.

Rashmi Gautam

బాగా క్రేజ్ ఉండి, పాపులారిటీ ఉన్న వాళ్లకు ఎటువంటి ప్రయత్నాలు చెయ్యకుండానే అవకాశాలు వస్తాయి. కానీ, మిగతావాళ్లకు మాత్రం ఆఫర్లు రావాలంటే దర్శక, నిర్మాతల గుడ్ బుక్స్ లో ఉండాలి అని చెప్తోంది.

Advertisement
 

More

Related Stories