సినిమాలు వదిలేసిన రష్మీ

- Advertisement -
Rashmi Gautam

రష్మీ గౌతమ్ ఇక పూర్తిగా సినిమాలకు టాటా చెప్పినట్లే. ఆమె కొత్తగా సినిమాలు ఏవీ ఒప్పుకోవడం లేదు. పూర్తిగా టీవీ కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది. “గుంటూరు టాకీస్” సినిమాతో సెక్స్ సింబల్ ఇమేజ్ పొందింది. కానీ, ఆ గ్లామర్ ఇమేజ్ కొంతకాలమే పనికొచ్చింది. ఆ సినిమా ఊపులో అర డజన్ సినిమాలు వచ్చాయి. కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు.

లాక్డౌన్ తర్వాత ఆమెకి క్లారిటీ వచ్చిందట. ఇకపై ఆమెకి పెద్దగా సినిమా ఆఫర్లు రావనే విషయం రష్మీకి తెలిసొచ్చింది.

మరో బుల్లితెర యాంకర్ అనసూయ కూడా ఐటెం సొంగులు, స్పెషల్ రోల్స్ చేసుకుంటూ వెళ్తోంది. ఐతే, అనసూయ చేస్తున్న పాత్రల తరహాలో రష్మీ చెయ్యదలుచుకోలేదు. అందుకే ఆమె ఇక బుల్లితెరకే పరిమితం అవుతుందట.

Also Check: Rashmi Gautam in a red gown

More

Related Stories