రష్మీ, సుధీర్ సీక్రెట్స్ లీక్

జబర్దస్త్ బ్యూటీ రష్మి, సుడిగాలి సుధీర్ మధ్య కెమిస్ట్రీ గురించి అందరికీ తెలిసిందే. కొంతమంది దీన్ని ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే అంటారు. చాలామంది ఆఫ్-స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ఉందని చెబుతుంటారు. ఇలాంటి పుకార్లు ఎన్ని ఉన్నప్పటికీ వీళ్లు మాత్రం తన ఎఫైర్ తో బుల్లితెరపై సెగలు రేపుతూనే ఉన్నారు.

తాజాగా మరోసారి రష్మీ, సుధీర్ తమ కెమిస్ట్రీని బయటపెట్టారు. ఈసారి ఏకంగా పెళ్లి, వంట చేయడం, అత్తవారి వేధింపులు లాంటి విషయాలు కూడా మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్కిట్ లో భాగంగా అదుర్స్ ఆనంద్ టీమ్… రష్మి-సుధీర్ మధ్య ఉన్న ఎఫైర్ నే కాన్సెప్ట్ గా తీసుకొని ఓ స్కిట్ చేసింది. ఆ స్కిట్ తర్వాత దానికి కొనసాగింపుగా.. నిజంగానే రష్మి-సుధీర్ స్టేజ్ పైకి వచ్చారు. అయితే టీమ్ లీడర్ చెప్పిన డైలాగ్స్ వదిలేసి తమలోతాము ముద్దుముచ్చట్లాడుకున్నారు. అది కాస్తా వైరల్ అయింది.

తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదంటూ రష్మి-సుధీర్ చెబుతున్న ప్రతిసారి.. ఇలాంటి ఓ వీడియో ఒకటి బయటకొచ్చి అనుమానాలు రేకెత్తిస్తూనే ఉంది.

Related Stories