ఆగిపోయిన రష్మిక హిందీ చిత్రం

రష్మిక మందాన బాలీవుడ్ లో దూసుకెళ్తోంది. ఆమె మొదటి సినిమా ఇంకా విడుదల కాలేదు. కానీ పలు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. అలాగే, టైగర్ ష్రాఫ్ సరసన ఒక మూవీ ఒప్పుకొంది. కానీ ఈ సినిమా మొదలు కాకముందే ఆగిపోయింది.

‘స్క్రూడీలా’ (Screw Dheela) అనే పేరుతో దర్శకుడు శశాంక్ ఖైతాన్ఒ క భారీ చిత్రం ప్లాన్ చేశారు. టైగర్, రష్మిక జంటగా నటిస్తున్నట్లు ఆ సినిమా ప్రకటన కూడా వచ్చింది. ఐతే, నిర్మాత కరణ్ జోహార్ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టాడట. అన్ని లెక్కలు వేసుకొని… ఇది వర్క్ అవుట్ కాదని తేల్చాడట. అలా సినిమా ఆగిపోయింది.

ఈ సినిమా కోసం టైగర్ 35 కోట్ల రూపాయలు అడిగాడట. రష్మిక 4 కోట్లు. మొత్తం బడ్జెట్ 140 కోట్లు అయ్యేలా ఉందట. ఇటీవలే ‘లైగర్’ సినిమాతో దెబ్బతిన్న నిర్మాత కరణ్ జోహార్… బడ్జెట్ విషయంలో ఇక జాగ్రత్తలు పాటించడం మొదలు పెట్టాడట. టైగర్, రష్మిక జంటగా రూపొందే ఈ మూవీకి 140 కోట్లు పెడితే రికవరీ చెయ్యడం సులువు కాదని కరణ్ గ్రహించాడట. ఆడితే, గిట్టుబాటు అవుతుంది. తేడా వస్తే చాలా నష్టం. ఒకవేళ ఫ్లాప్ అయినా నష్టం తక్కువవుండే సినిమాలే కరణ్ చేయాలనుకుంటున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందనేది బాలీవుడ్ మీడియా సమాచారం.

రష్మిక ఖాతాలో మొన్నటివరకు 5 హిందీ చిత్రాలు ఉండేవి. అందులోంచి ఇప్పుడు ఒకటి పోయింది.

 

More

Related Stories