విజయ్ ప్రైవేట్ పార్టీలో రష్మిక

Rashmika

కొంతమంది హీరోహీరోయిన్ల బంధం కేవలం తెరపై వరకు మాత్రమే పరిమితం కాదు. షూటింగ్ లో భాగంగా వాళ్లు దగ్గరవుతారు. మనసులు కలుస్తాయి. బెస్ట్ ఫ్రెండ్స్ గా మారతారు. కానీ ఆ సినిమాల తర్వాత కూడా వాళ్ల అనుబంధం కొనసాగుతుంది. అలాంటి బంధమే విజయ్ దేవరకొండ-రష్మికది కూడా. 


వీళ్లిద్దరూ క్లోజ్ అనే విషయం చాలామందికి తెలుసు. కానీ ఎంత క్లోజ్ అనే విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. విజయ్ హార్ట్ కు రష్మిక ఎంత దగ్గర అనే విషయాన్ని ఎలివేట్ చేసే అకేషన్ ఇది.

ఈరోజు విజయ్ తల్లి తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. స్టార్ మదర్ కాబట్టి సహజంగానే ఆమె బర్త్ డే ఆర్భాటంగా జరుగుతుంది. జరిగింది కూడా. అయితే పూర్తిగా ఇది విజయ్ దేవరకొండ కుటుంబ వ్యవహారం. ఇండస్ట్రీకి సంబంధం లేని అంశం. అయినప్పటికీ ఈ బర్త్ డే పార్టీలో రష్మిక మెరిసింది.

అవును.. విజయ్ దేవరకొండ తల్లి 50వ పుట్టినరోజు వేడుకలకు రష్మిక హాజరైంది. ఆంటీకి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు విజయ్-రష్మిక బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడానికి. 

Related Stories