బీచ్లో రష్మిక ఎక్సర్ సైజు

- Advertisement -
Rashmika Beach Workout

రీసెంట్ గా సముద్ర తీరాన ఎక్సర్ సైజు చేస్తున్న ఫొటోలు కొన్ని పోస్ట్ చేసింది రష్మిక. దాన్ని చాలామంది మెచ్చుకున్నారు. ఎప్పట్లానే కొందరు ట్రోల్ చేశారు. అయితే రష్మిక మాత్రం తగ్గలేదు. ఈసారి ఏకంగా బీచ్ వర్కవుట్ వీడియో పోస్ట్ చేసింది.

తను బీచ్ లో ఎలాంటి ఎక్సర్ సైజులు చేస్తుందో విడమర్చి మరీ చెప్పింది రష్మిక. ఆ అనుభూతి చాలా బాగుందని చెబుతోంది ఈ కన్నడ బ్యూటీ.

“బీచ్ లో వర్కవుట్స్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఇది చాలా కష్టం. కానీ అలవాటు పడితే వదల్లేం. అలల చప్పుడు, సముద్రపు వాసన, సూర్యాస్తమయం, కాళ్లకు అంటుకున్న మట్టి.. ఇవన్నీ ఎంతో అందంగా ఉన్నాయి.”

తన ట్రయినర్ పర్యవేక్షణలో నల్లటి నిక్కరు వేసుకొని రష్మిక బీచ్ లో వ్యాయామం చేస్తుంటే చూడముచ్చటగా ఉంది. ఇకపై తను ఏ ప్రదేశానికి వెళ్లినా అక్కడ వర్కవుట్ చేసే వీడియో పోస్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నట్టు ప్రకటించింది రష్మిక.

More

Related Stories