రష్మిక మూవీకి రిలీజ్ డేట్ ఖరారు

Rashmika

రష్మిక ఇటీవలే బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ ఏడాది ఆమె రెండు హిందీ చిత్రాల్లో నటించింది. ఐతే, ఆ రెండు చిత్రాలూ వచ్చే ఏడాదే విడుదలవుతాయి.

ఆమె మొదటి హిందీ చిత్రం… ‘మిషన్ మజ్ను’. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నారు. షూటింగ్ మొత్తం పూర్తి అయింది. ఈ సినిమా వచ్చే వేసవిలో విడుదల కానుంది. మే 13, 2022న వస్తున్నామంటూ తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.

రష్మిక ఈ సినిమాతో పాటు అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ‘గుడ్ బై’ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాకి ఇంకా విడుదల తేదీ ప్రకటించలేదు. ప్రస్తుతం ఆమె మరో రెండు హిందీ సినిమాల్లో అవకాశాల కోసం చర్చలు జరుపుతోంది. అవి కూడా ఓకె అయ్యేలా ఉన్నాయి. తెలుగుతో పాటు హిందీ సినిమాలపై కూడా ఫుల్లుగా ఫోకస్ పెట్టింది.

తెలుగులో ప్రస్తుతం ఆమె చేతిలో ‘పుష్ప’, ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ఉన్నాయి.

Advertisement
 

More

Related Stories