రష్మిక ’25’ సెలెబ్రేషన్స్

- Advertisement -
Rashmika

ఇప్పుడు ఒక సెలబ్రిటీకున్న పాపులారిటీకి కొలమానం … ఇంస్టాగ్రామ్ లో ఉన్న ఫాలోవర్స్. ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే అంత క్రేజ్ ఉందన్నట్లు. హీరోయిన్ రష్మిక ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో ఒక మైలు రాయి చేరుకొంది. ఈ అకేషన్ ని ‘బర్త్ డే’ సెలెబ్రేషన్స్ లెవల్లో సంబరాలు చేసుకొంది.

ఆమెకి 25 మిలియన్ల ఫాలోవర్స్ దాటారు. దాంతో ఆమె పెద్ద కేకు కట్ చేసింది. తన ఇంటిని 25 సంఖ్యతో కూడిన బెలూన్లతో డెకరేట్ చేసుకొంది. ఆ ఫోటోలను వీడియోలను షేర్ చేసింది.

ఈ భామకి టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా క్రేజ్ పెరుగుతోంది. అందుకే, ఇన్ స్టాలో అలా ఉంది ఆమె గ్రోత్. ఇప్పటికే సమంత (20 మిలియన్లు), పూజ హెగ్డే (16 మిలియన్లు) లని దాటేసింది రష్మిక. ఈ విషయంలో ఆమె ఇప్పుడు బాలీవుడ్ భామలతో పోటీపడుతోంది. అంటే, ఇది పెద్ద విజయమే. అందుకే, అంత పెద్ద సంబరాలు చేసుకొంది.

రష్మిక ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ సరసన ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ చిత్రంలో నటిస్తోంది. ‘పుష్ప 2’ కూడా ఉంది. అలాగే, హిందీలో రెండు చిత్రాలు ఉన్నాయి.

 

More

Related Stories