మాస్క్ మర్చిపోయి… సారీ చెప్పిన రష్మిక!

- Advertisement -

లాక్డౌన్ ఎత్తేశారు. కానీ కోవిడ్ పోలేదు. బయట అడుగుపెడితే మాస్క్ పెట్టుకోవాల్సిందే. సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందే. ఐతే చాలామంది కొంత దూరం వెళ్ళాక మాస్క్ పెట్టుకోలేదని గ్రహిస్తారు. అలాంటిదే రష్మిక విషయంలో జరిగింది.

నిన్న ముంబైలోని ఒక సినిమా ఆఫీస్ కి వచ్చింది రష్మిక. కారు దిగిన కాసేపటి తర్వాత మాస్క్ పెట్టుకోలేదని అర్థం అయింది. అక్కడ ఉన్న ఫోటో జర్నలిస్టులకు వెంటనే క్షమాపణ చెప్పింది. మాస్క్ మరిచిపోయినందుకు సారీ అని చెప్పి… కారులో నుంచి మాస్క్ తీసుకొని తగిలించుకొంది.

ఇప్పుడు ఈ వీడియో వైరలవుతోంది.

అన్నట్లు, రష్మిక కూడా ఈ మధ్య ఎక్కువగా పొట్టి డ్రెస్సులతోనే కనిపిస్తోంది. బాలీవుడ్ హీరోయిన్లు ఎక్కువగా షార్ట్ లలోనే కనిపిస్తారు. ముంబైలో ఆ కల్చర్ ఎక్కువ. ఇటీవలే రష్మిక తన మకాం ముంబైకి మార్చింది. అక్కడ రెండు సినిమాలు చేస్తోంది. మూడో సినిమా ఒప్పుకునే ప్రయత్నంలో ఉంది. దాంతో,
రష్మిక ఎక్కువగా పొట్టి డ్రెస్సులు, షార్ట్స్ తోనే కనిపిస్తోంది. ఈ ఆఫీస్ కి కూడా అలాగే వచ్చింది.

 

More

Related Stories