రష్మిక చికెన్ తినే వెజిటేరియన్!

రష్మిక మందాన నిత్యం ఎదో విషయంలో ట్రోలింగ్స్ ఫేస్ చేస్తూనే ఉంటుంది. ఆమె ప్రతి చర్యని కొంతమంది అదే పనిగా అబ్జర్వు చేస్తుంటారు కాబోలు. లేటెస్ట్ గా ఆమె నటించిన ఒక యాడ్ ఫిలిం ఆమెని ట్రోల్ చేసేందుకు కారణమైంది.

రష్మిక అనేక బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తోంది. వాటిద్వారా సినిమాల్లో కన్నా ఎక్కువగా డబ్బు సంపాదిస్తోంది. తాజాగా ఒక బర్గర్ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తోంది. ఈ బ్రాండ్ అందించే ఫ్రైడ్ చికెన్ తింటూ ఆ యాడ్ లో నటించింది. వెంటనే ట్రోలర్స్ తమ పని మొదలు పెట్టారు. ఆమె గతంలో చెప్పిన స్టేట్ మెంట్స్ తవ్వి తీశారు.

ఇంతకీ ఆమె గతంలో ఏమి చెప్పింది ఏంటంటే… తాను పూర్తిగా శాకాహారిని అని తెలిపింది. వెజిటేరియన్ అలవాట్లను తాను ఎంకరేజ్ చేస్తాను అన్నట్లుగా మాట్లాడింది. వెజిటేరియన్ అయి ఉండి ఫ్రైడ్ చికెన్ తింటూ యాడ్ ఎలా చేస్తావు అని ట్రోల్స్ ఆమెని ప్రశ్నిస్తున్నారు.

బహుశా ‘చికెన్ తినే వెజిటేరియన్ కాబోలు’ అంటూ వెక్కిరిస్తున్నారు.

Rashmika

రష్మిక ప్రస్తుతం ‘పుష్ప 2’, ‘యానిమల్’ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే ‘రెయిన్ బో’ అనే లేడి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటోంది.

 

More

Related Stories