రష్మిక “కొంత స్టఫ్” చూసిందట

- Advertisement -
Rashmika

రష్మిక మందాన … విజయ్ దేవరకొండకి క్లోజ్ ఫ్రెండ్. ఒకవిధంగా దేవరకొండ ‘ఫ్యామిలీ’ ఫ్రెండ్ అనుకోవచ్చు. అందుకే… రష్మికకి దేవరకొండ తన సినిమాల సీన్లు ముందే చూపిస్తుంటాడు అని అంటారు. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ అది నిజమే అని కన్ఫర్మ్ చేశాడు.

విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ… “లైగర్”. ఈ సినిమా ఇంకా 60 శాతం పూర్తి కావాలి. కానీ అప్పుడే రష్మిక “కొంత స్టఫ్” చూసిందని చెప్పాడు.


“లైగర్” ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదలైంది. పోస్టర్ చూసి రష్మిక ఎగ్జైట్ అయింది. “ఈ మాస్టర్ పీస్ ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. థియేటర్లో గ్యారెంటీగా డాన్స్, ఈలలు వేస్తా,” అని ఆమె ట్వీట్ చేసింది. దానికి విజయ్ ఇచ్చిన రిప్లై…. “నువ్వు ఆల్రెడీ కొంత చూశావు. నీతో పాటు ప్రేక్షకులు కూడా చప్పట్లు, ఈలలతో వీరంగం వేస్తారని గ్యారెంటీ ఇస్తున్నా.

విజయ్ దేవరకొండ మాటతో అభిమానులు అంచనాలు భారీగా పెంచుకుంటున్నారు.

 

More

Related Stories