ఇంకోటి ఒప్పుకుందట!

Rashmika

రష్మికకి బాలీవుడ్ లో క్రేజ్ పెరుగుతోంది. మొదటి సినిమా హిట్ కాలేదు. అప్పుడే మూడో సినిమా ఆఫర్ కూడా వచ్చిందట. ప్రస్తుతం ఆమె సిద్దార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’ చిత్రంలో నటిస్తోంది. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘గుడ్ బై’ సినిమా కూడా ఆమె ఖాతాలో ఉంది. మొదటి సినిమా ‘మిషన్ మజ్ను’ ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. రెండో సినిమా షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయి… కోవిడ్ పరిస్థితుల వల్ల ఆగింది.

తాజాగా అభిమానులతో జరిపిన చిట్ చాట్ లో మూడో సినిమా ఒప్పుకున్నట్లు హింట్ ఇచ్చింది రష్మిక. ఐతే, ఆ సినిమా డీటెయిల్స్ వెల్లడించలేదు.

ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప’, శర్వానంద్ సరసన ‘ఆడవారు మీకు జోహార్లు’ సినిమాలు చేస్తోంది. మొత్తానికి బాలీవుడ్ లో క్రేజ్ పెంచుకుంటోంది.

More

Related Stories