రష్మికని అంత బాధ పెడుతున్నారా?

రష్మిక చాలా పెద్ద లెటర్ రాసింది. తనని కొందరు ఎలా వేధిస్తున్నారో తెలియచేస్తూ తన ఆవేదనని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆమె లెటర్ చదివితే రష్మికని మాములుగా వేధించడం లేదని అర్థమవుతోంది. ఆమె చాలా హర్ట్ అయి ఈ లెటర్ రాసింది.

రష్మిక తన కెరీర్ ప్రారంభంలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలు, అందులోని కొన్ని ముక్కలను తీసుకొని ఆమెని కొంతమంది ఆకతాయిలు చాలాకాలంగా ఆన్లైన్లో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకముందు కూడా వారిని హెచ్చరించింది. ఇప్పుడు బాలీవుడ్ ఇంటర్వ్యూలను తీసుకొని ట్రోల్ చేస్తున్నారు. దాంతో ఆమె ఒక్కసారిగా బరస్ట్ అయింది.

ALSO READ: Rashmika Mandananna hits out at trolls

నిజానికి, ఆన్లైన్లో ఆమెకున్నంత పాపులారిటీ మరో దక్షిణాది హీరోయిన్ కి లేదు. ట్విట్టర్లో 4 మిలియన్ల ఫాలోవర్స్, ఇన్ స్టాగ్రామ్ లో 35 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఎంత పాపులారిటీ ఉన్నా ట్రోలింగ్ కూడా అంతే ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. అన్ని లక్షల మంది ఫాలోవర్స్ నుంచి ఆమెకి రోజుకు వేలకొద్దీ కామెంట్స్ వస్తాయి. అన్ని వేల కామెంట్స్ లో ఆమె ట్రోలింగ్ కి సంబంధించినవే ఎక్కువగా చదువుతున్నట్లు కూడా అర్థమవుతోంది.

ఒక స్థాయికి వెళ్ళాక, హీరోలు, హీరోయిన్లు కామెంట్లు, ట్రోలింగ్ మాటలు చదవడం మానేస్తారు. ఎందుకంటే, దానివల్ల మానసిక ఆందోళన తప్ప మరోటి ఉండదు. కానీ, రష్మిక ట్రోల్స్ ని సీరియస్ గా తీసుకొంటోంది. అందుకే, ఆమె ఇంత పెద్ద లెటర్ రాసింది. ట్రోల్స్ చేసే కామెంట్స్ తన మనసుని ఎంత బాధ పెడుతున్నాయో చెప్పింది.

 

More

Related Stories