దేవరకొండ ఫ్యామిలీ ‘ఫ్రెండ్’!

చూస్తుంటే.. విజయ్ దేవరకొండ ఫ్యామిలీలో రష్మిక బాగా కలిసిపోయినట్టు కనిపిస్తోంది. మొన్నటికిమొన్న విజయ్ తన తల్లి బర్త్ డేను సెలబ్రేట్ చేస్తే, ఆ పార్టీలో జాయిన్ అవ్వడం కోసం లాక్ డౌన్ టైమ్ లో మంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చింది రష్మిక. అప్పట్లో వీళ్లిద్దరి అనుబంధం చూసి అంతా సరదాపడ్డారు.

ఇప్పుడు విజయ్ దేవరకొండ తమ్ముడి కోసం ఓ రేంజ్ లో కష్టపడుతోంది రష్మిక.

ఈనెల 20న ఆనంద్ దేవరకొండ నటించిన “మిడిల్ క్లాస్ మెలొడీస్” సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించి నిన్న ట్రయిలర్ రిలీజైంది. ఆ ట్రయిలర్ ను స్వయంగా విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక లాంఛ్ చేసింది. అక్కడితో ఆగలేదు ఈ చిన్నది. ఈ సినిమా ప్రచారం కోసం వరుసగా ట్వీట్స్ పెడుతూనే ఉంది.

ఇలా విజయ్ దేవరకొండ ఫ్యామిలీకి బాగా క్లోజ్ అయిపోయింది రష్మిక. విజయ్ దేవరకొండ, రష్మిక … “గీత గోవిందం”, “డియర్ కామ్రేడ్” చిత్రాల్లో జంటగా నటించారు.

Related Stories