రష్మికకి దక్కని ఛాన్స్

రష్మిక మందాన తమిళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. ఆమె నటించిన ఫస్ట్ తమిళ్ మూవీ… సుల్తాన్. కార్తీ హీరో. ఈ సినిమా వచ్చే నెల 2న విడుదల కానుంది. ఇప్పటికే సుల్తాన్ ట్రైలర్ కూడా వచ్చింది. తెలుగులో ఆమెకి ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని రష్మికని విజయ్ కొత్త సినిమాలో తీసుకోవాలనుకున్నారు. ఆమెకి ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చారని ప్రచారం జరిగింది.

ఐతే, ఫైనల్ గా ఈ ఛాన్స్ పూజ హెగ్డేకి దక్కింది. విజయ్ 65వ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే ఫిక్స్ అయింది. నిర్మాతలు కూడా ఈ రోజు ఆమె పేరుని ప్రకటించారు. ఆలా… రశ్మికకి ఛాన్స్ రాకుండా చేసింది పూజ.

ఇప్పటికే ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, నాగ చైతన్య వంటి హీరోలతో నటించింది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ‘ఆచార్య’లో కూడా నటిస్తోంది. తమిళ్ లో మాత్రం పూజకిప్పుడే అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ లో ఆల్రెడీ సల్మాన్ ఖాన్, హ్రితిక్ రోషన్, అక్షయ్ కుమార్ వంటి పెద్ద హీరోల సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీని కూడా ఏలుతుందేమో.

Also Check: Rashmika Mandanna in a Saree

పూజ వల్ల రష్మికకి కొంత నష్టమే.

More

Related Stories