రష్మిక బర్త్ డేకిదే ట్రీట్!

Rashmika Mandanna

రష్మిక మందాన ఇప్పుడు ఇండియాలోనే టాప్ హీరోయిన్లలో ఒకరు. ఆమె రేంజ్, క్రేజ్ వేరుగా ఉంది మరి. అందుకే, ఆమె పుట్టిన రోజు నాడు స్పెషల్ టీజర్లు, పోస్టర్లు విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపుగా ప్రతి హీరోకి ఇలా చేస్తారు. ఇప్పుడు ఈ ఫిమేల్ స్టార్ కి కూడా అదే జరుగుతోంది

ఆమె ప్రస్తుతం “పుష్ప 2” సినిమాతో పాటు “ది గర్ల్ ఫ్రెండ్” అనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం కూడా చేస్తోంది. “పుష్ప 2” సినిమా నుంచి ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తారంట.

ఇక “ది గర్ల్ ఫ్రెండ్” చిత్రం టీజర్ రష్మిక పుట్టిన రోజు రిలీజ్ చేస్తామని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ రెండు బర్త్ డే ట్రీట్స్ ఆమె అభిమానులకు ఆనందాన్ని కలిగించడం ఖాయం.

ఈ సారి పుట్టిన రోజుకి ఇండియాలోనే ఉంటుందట. ఏప్రిల్ 5 ఆమె పుట్టిన రోజు.

Advertisement
 

More

Related Stories