సౌందర్య బయోపిక్ చేస్తుందట

Rashmika Mandanna

రష్మిక మందానకి కూడా ఒక డ్రీం రోల్ ఉంది. అదే నటి సౌందర్య పాత్ర పోషించడం. దక్షిణ చిత్రసీమలో సౌందర్య స్థానం ప్రత్యేకం. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అగ్ర కథానాయకిగా అనేక ఏళ్ళు ఏలింది సౌందర్య. నటిగా మంచి స్థానంలో ఉన్న సమయంలోనే ఆమె 2004లో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు.

సౌందర్య బయోపిక్ తీయాలని చాలామంది నిర్మాతలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరూ ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ ని లాంచ్ చెయ్యలేదు.

హీరోయిన్ రష్మిక మందాన మాత్రం ఎవరు సౌందర్య బయోపిక్ ని తీసినా తాను నటించేందుకు రెడీ అంటోంది. ఆమెకి సౌందర్య అంటే ఇష్టం. ఇద్దరూ కన్నడిగులే. సౌందర్య ఎలా తెలుగులో పెద్ద స్టార్ అయ్యారో ఇప్పుడు రష్మిక తెలుగులో అగ్ర కథానాయికగా ఎదిగింది.

మరి రష్మికని హీరోయిన్ గా పెట్టి సౌందర్య బయోపిక్ ని ఎవరు తీస్తారో చూడాలి. ఆమె డ్రీం నెరవేరుతుందా?

More

Related Stories