
రష్మిక ఇప్పటివరకు బాలీవుడ్ లో సరైన హిట్ ఒక్కటీ అందుకోలేదు. కానీ, ఆమెకి అక్కడ అవకాశాలు మాత్రం పుష్కలం. ప్రస్తుతం విడుదల కావాల్సిన ‘యానిమల్’ చిత్రం భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా షాహిద్ కపూర్ సరసన ఒక సినిమా లాగేసుకొంది.
షాహిద్, రష్మిక జంటగా ఒక సినిమా త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇది కూడా ఆమెకి హిందీలో పెద్ద చిత్రమే. షాహిద్ మంచి క్రేజున్న హీరో. ఈ సినిమాతో పాటు మరో సినిమా కూడా సైన్ చెయ్యనుందట. ఆ వివరాలు త్వరలో తెలుస్తాయి.
రష్మికకి ‘పుష్ప’ సినిమాతో నార్త్ ఇండియాలో క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఆమె నటించిన హిందీ చిత్రాలు – గుడ్ బై, మిషన్ మజ్ను- పెద్దగా పేరు తీసుకురాలేదు. కానీ అక్కడ క్రేజ్ మాత్రం అలాగే ఉంది. అందుకే, హిందీలో ఆమెకి కొత్తగా ఆఫర్లు వస్తున్నాయి. దానికి తోడు ఆమె ముంబైలో సరైన టాలెంట్ ఏజెన్సీని పెట్టుకొంది. ఆ సంస్థ ఆమెకి మంచి హిందీ ప్రాజెక్ట్స్ సెట్ చేస్తోంది అని టాక్.
ఇక తెలుగులో ఆమె చేస్తున్న ఏకైక బడా చిత్రం… పుష్ప 2. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ సరసన ఒక సినిమా కూడా చేస్తోంది. ఐతే, ఇది మిడ్ రేంజ్ మూవీ.