శ్రీవల్లి జోరు షురూ

- Advertisement -
Rashmika Mandanna

శ్రీవల్లి లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తుంది. రష్మిక జోరు మళ్ళీ మొదలైంది. ఆమె కంటిన్యూస్ గా “పుష్ప 2” షూటింగ్ లో పాల్గొంటోంది ఇప్పుడు. రెండో భాగంలో రష్మిక పాత్రని తగ్గించారు, అందుకే ఆమె షూటింగ్ లో పాల్గొనడం లేదు అని ఆ మధ్య రూమర్స్ వచ్చాయి.

కానీ శ్రీవల్లి పాత్ర నిడివి రెండో భాగంలో కూడా ఎక్కువేనట. మొదటి భాగం “పుష్ప”లో అల్లు అర్జున్, రష్మిక రొమాంటిక్ సీన్లు బాగా హైలెట్ అయ్యాయి. ఇందులో కూడా ఒక పెద్ద ట్రాక్ ఉంటుందట. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో అల్లు అర్జున్, రష్మికకి సంబందించిన సన్నివేశాలు తీస్తున్నారు.

రష్మిక చేతిలో ఉన్న బడా తెలుగు చిత్రం ఇది. ధనుష్ సరసన రీసెంట్ గా ఒక సినిమా ఒప్పుకొంది. కానీ ఆ సినిమా షూటింగ్ మొదలు కాలేదు. ఇక హిందీలో రణబీర్ కపూర్ సరసన నటిస్తున్న “యానిమల్’ షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. సో… ఈ లెక్కన చూస్తే ఇప్పుడు రష్మిక నటిస్తున్న ఏకైక బడా చిత్రమే ఇదే. సో, గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ కి వస్తోందట.

ఈ సినిమా కోసం ఆమెకి పారితోషికం కూడా పెంచారని టాక్ వినిపిస్తోంది.

 

More

Related Stories