తొలి సినిమాతోనే దెబ్బ పడింది!

Rashmika

రష్మిక నటించిన తొలి తమిళ చిత్రం.. సుల్తాన్. ఈ సినిమా తెలుగులో డిజాస్టర్. తమిళనాడులో కూడా అపజయం పాలైంది. తమిళనాడులో ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్ సాధించింది సుల్తాన్. ఆ తర్వాత తుస్సుమంది. దాంతో, ‘సుల్తాన్’ వల్ల ఆమెకి తమిళంలో కలిసొచ్చింది ఏమి లేదు. పైగా, ఆమె పాత్ర కూడా గొప్పది కాదు. ఈ సినిమా వల్ల సక్సెస్ రాలేదు, క్రేజ్ పెరగలేదు, నటిగా గుర్తింపు లేదు.

అలా, తమిళ అరంగేట్రం ఆమెకి నీరసం తెప్పించింది. మరో మూవీ చేస్తే కానీ తమిళనాడులో ఆమెకి పాపులారిటీ వచ్చేలా లేదు.

ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెడుతోంది. హిందీలో ఒకేసారి రెండు సినిమాలు చేస్తోంది. అక్కడ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. తెలుగులో మాత్రం ఈ కన్నడ కస్తూరికి క్రేజ్ మామూలుగా లేదు.

More

Related Stories