గౌన్స్ అంటే చాలా ఇష్టం: రష్మిక

Rashmika Mandanna

ఐస్ క్రీమ్ తో ఆవకాయ్ తిన్నారా? పెరుగున్నంలో బిర్యానీ కలుపుకున్నారా? చెప్పుకోడానికి ఇవి కాస్త వింతగా ఉంటాయి కానీ రష్మిక మాత్రం ఇలాంటి కాంబినేషన్లు చాలా ట్రై చేస్తుంది. రకరకాలు మిక్స్ చేసి తినడం తనకు ఇష్టమంటోంది. ఈ హైపర్ యాక్టివ్ బ్యూటీ ఇంకా ఏమేం చెబుతోందో ఫటాఫట్ చూసేద్దాం..

ఇష్టమైన దుస్తులు..?
కంఫర్ట్ గా ఉండే దుస్తులు ఏవైనా నాకు ఇష్టమే. ప్రత్యేకంగా బ్రాండ్స్ అంటూ లేవు. కాకపోతే జిమ్ వేర్ నాకు బాగా ఇష్టం. అవి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. గౌన్ వేసుకోవడం కూడా ఇష్టం. నా దగ్గర చాలా గౌన్స్ ఉన్నాయి.

ప్రతి రోజూ పొద్దున్నే లేచి కెమెరా ముందుకు రావడం ఎలా ఉంటుంది?
ప్రతి రోజూ ఓ ఎగ్జామ్ రాస్తున్నట్టు ఉంటుంది. డైలాగ్స్ గుర్తుపెట్టుకోవాలి. పొజిషన్, యాంగిల్ గుర్తుపెట్టుకోవాలి. పెర్ ఫెక్ట్ గా చేయాలి. కొంచెం ఒత్తిడిగానే ఉంటుంది కానీ బాగుంటుంది.

ALSO CHECK: Rashmika Mandanna Latest Photos

చిన్నప్పటి జ్ఞాపకం…
చిన్నప్పుడు మ్యాథ్స్ ట్యూషన్ అయిన వెంటనే పక్కనే ఉన్న మామిడి చెట్టు ఎక్కి కాయలు తెంచుకునేదాన్ని. ఆంటి కర్ర పట్టుకొని వచ్చి వెంబడించేది. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చిన్నప్పుడు నేను స్పైడర్ ఉమెన్ లా ఉండేదాన్ని. కిటికీలు, చెట్లు, గుట్టలు ఏవి పడితే అవి ఎక్కేసేదాన్ని.

స్ట్రెస్ బస్టర్ ఏంటి?
ఒత్తిడికి గురైనప్పుడు జిమ్ కు వెళ్లడానికి ఇష్టపడతాను. లేదంటే మ్యూజిక్ వింటాను. టీవీ చూస్తాను. ఐస్ క్రీమ్ తింటాను. లాంగ్ డ్రైవ్ కు వెళ్తాను.

హోటల్స్ నుంచి ఏమైనా దొంగిలించారా?
హోటల్స్ లో షాంపూలంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమైన షాంపూలన్నీ తెచ్చుకుంటాను. కొన్ని హోటల్స్ నుంచి సబ్బులు కూడా తెచ్చుకుంటాను.

క్లాస్ లో ఏదైనా తింటూ టీచర్ ను ఇబ్బంది పెట్టారా?
చిన్నప్పుడు నేను హాస్టల్ లో ఉండేదాన్ని. ఇక క్లాస్ లో తినే అవకాశమే రాలేదు. ఇక టీచర్లను ఇబ్బంది పెట్టే విషయానికొస్తే.. నేను పెద్దగా చదివేదాన్ని కాదు. అలా అని అల్లరి చేసే దాన్ని కూడా కాదు.

నెగెటివిటీని ఎలా డీల్ చేస్తారు?
కెరీర్ స్టార్టింగ్ లో నో చెప్పడం తెలిసేది కాదు. ధైర్యంగా ఉండడం తెలిసేది కాదు. ఇంట్లోంచి బయటకొచ్చి, వేరే లొకేషన్ లో ఉండడం చాలా ఇబ్బందిగా ఉండేది. నా దృష్టిలో ఇవన్నీ నెగెటివిటీ కిందకే వస్తాయి. వాటిని నేను అధిగమించాను. ఇక విమర్శల విషయానికొస్తే.. నాకు బలమైన ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. కాబట్టి అవి నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టవు.

లాక్ డౌన్ లో చేసిన బెస్ట్ పని?
ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ గడిపాను. కొంచెం వంట నేర్చుకున్నాను. పాన్-కేక్స్ చేశాను. నా సహనం పెరిగింది. నన్ను నేను బాగా అర్థం చేసుకోవడానికి లాక్ డౌన్ పనికొచ్చింది.

తల్లిదండ్రుల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టారా?
నేను రోజూ చేసే పనే అది. నాతో వాళ్లకు అన్నీ ప్రాబ్లమ్సే. చిన్నప్పుడు సరిగ్గా చదువుకోలేదు. ఇప్పుడేమో సినిమాల్లోకి వచ్చిన తర్వాత వాళ్లకు మరిన్ని ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఇప్పటికీ మా అమ్మా-నాన్న నాకు ఒకటే చెబుతారు. ఏదైనా చేయి కానీ వార్తల్లోకి మాత్రం రావొద్దు అంటారు.

ఇప్పటికీ వదిలించుకోలేని అలవాట్లు ఉన్నాయా?
పెద్ద లిస్ట్ ఉంది. ఎక్కువగా ఆందోళన చెందుతుంటాను. ప్రతిదానికి నవ్వుతుంటాను. నేను ఎక్కువగా రియాక్ట్ అవుతుంటాను. ఈ అలవాట్లు తగ్గించుకోవాలి.

తిండిలో మిక్సింగ్ ఏదైనా ఉందా?
చాలా ఉన్నాయి. బిర్యానీలో రసం కలుపుకొని తింటాను. పెరుగన్నంలో లేస్ తింటాను. నూడిల్స్ లో కూడా లేస్ వేసుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది. ఇక రెగ్యులర్ ఫుడ్ లో కూడా అన్నం, పప్పు, యోగర్ట్, కర్రీ కలిపి మిక్స్ చేసి తింటాను. విడివిడిగా కలుపుకొని తినడం బోర్.

ఏ సూపర్ పవర్ కావాలని కోరుకుంటారు?
ఇలా టచ్ చేస్తే మనసులో అనుకున్నది జరిగిపోవాలి. అలాంటి సూపర్ పవర్ కావాలి నాకు.

కాలేజ్ బంక్ కొట్టి వెళ్లిన సినిమా?
కాలేజ్ డేస్ లో చాలా బంక్ లు ఉన్నాయి. నాకు బాగా గుర్తున్నది మాత్రం గూగ్లీ అనే కన్నడ సినిమా. ఇంపార్టెంట్ క్లాస్ ఎగ్గొట్టి మరీ ఆ సినిమాకు వెళ్లాను.

పేరు అర్థం ఏంటి?
కిరణం ప్రారంభానికి పేరు అది. ఏదైనా ప్రారంభమవ్వాలంటే మూలం ఇది. ఉదాహరణకు ఓ పువ్వు వికసించిందని అనుకుందాం. దానికి మూలం రష్మిక. రష్మి అంటే కిరణాలు. రష్మిక అంటే అన్నింటికీ మూలం అని అర్థం.

Advertisement
 

More

Related Stories