గ్యారెంటీగా అదిరిపోతుంది: రష్మిక

Rashmika Mandanna

“యానిమల్” చిత్రం ప్రమోషన్లు మొదలుపెట్టింది రష్మిక మందాన. ఆమెకి బాలీవుడ్ లో ఇది పెద్ద చిత్రం. ఇప్పటివరకు రెండు హిందీ సినిమాల్లో నటించింది. ఇది మూడోది. పైగా పెద్ద హీరో సరసన నటించిన మొదటి హిందీ చిత్రం. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే దర్శకుడు సందీప్ వంగా ఇంతకుముందు తీసిన “అర్జున్ రెడ్డి”, ఆ సినిమా హిందీ రీమేక్ “కబీర్ సింగ్” సంచలనాలు సృష్టించాయి. ఇప్పుడు “యానిమల్” కూడా అంచనాలు అందుకుంటుంది అని రష్మిక అంటుంది.

“సందీప్ వంగా చెప్పిన విధానం అలా ఉంది. గ్యారెంటీగా బాగుంటుంది. ఆయన గత చిత్రానికి ఏ మాత్రం తగ్గదు. ఇంకా సాలిడ్ గా ఉంటుంది,” అని రష్మిక తాజా ఇంటర్వ్యూలో చెప్పింది.

రణబీర్ కపూర్ ఈ సినిమాలో కథానాయకుడు. “రణబీర్ నటన గురించి అందరికీ తెలుసు. కానీ ఇందులో ఇంకో లెవల్లో ఉంటుంది. కొత్త రణబీర్ ని చూస్తారు జనం,” అని చెప్తూ అంచనాలు పెంచేసింది.

ఈ సినిమాలో ఆమె రణబీర్ కి భార్యగా నటించింది. ఈ సినిమాతో పాటు “పుష్ప 2” ఆమెకి పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ పెంచుతుంది. ఈ రెండు సినిమాలపై ఆమె చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.

Advertisement
 

More

Related Stories