ఇటలీకి సింగిల్ గా వెళ్ళదంట!

Rashmika Mandanna

“భీష్మ” సినిమాకు సంబంధించి ఓ సాంగ్ ను ఇటలీలో షూట్ చేశారు. ఆ టైమ్ లో ఇటలీలో కొన్ని అందాల్ని కవర్ చేసింది రష్మిక. అప్పటి అనుభూతుల్ని మరోసారి గుర్తుచేసుకుంది. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది ఈ బ్యూటీ.

ఇటలీ అనేది సోలోగా వెళ్లడానికి కాదట. గ్రూప్ తో వెళ్లి ఎంజాయ్ చేస్తేనే ఆ మజా తెలుస్తుందని చెబుతోంది. తొలిసారి ఇటలీకి సోలోగా (షూటింగ్ నిమిత్తం) వెళ్లానని.. ఈసారి ఆ తప్పు చేయనని అంటోంది. నలుగురితో సరదాగా వెళ్లి ఎంజాయ్ చేసే ప్రదేశంగా ఇటలీని చెప్పుకొచ్చింది.

Also Check: Rashmika Photoshoot Photos

ఇదే ఇటలీలో అప్పట్లో నితిన్-రష్మిక కలిసి హృతిక్ చేసిన ఓ సాంగ్ ను రీక్రియేట్ చేశారు. ఆ వీడియోను హృతిక్ రోషన్ ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు కూడా. ఆ జ్ఞాపకాలన్ని నెమరువేసుకున్న ఈ బ్యూటీ.. పరిస్థితులు అనుకూలిస్తే మరోసారి తప్పకుండా ఇటలీ వెళ్తానంటోంది.

Related Stories