మహారాణిగా రష్మిక మందాన

Rashmika

రష్మిక మందాన ఇప్పటివరకు బాలీవుడ్ లో నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. మూడో సినిమా ‘యానిమల్’ సెట్స్ పై ఉంది. ఐతే, ఆమెకి ఇంకా బాలీవుడ్ లో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ భామ ఒక హిందీ చిత్రంలో మహారాణి పాత్రని దక్కించుకుందని టాక్.

విక్కీ కౌశల్ హీరోగా ‘చావా’ అనే సినిమా రూపొందనుంది. ఇది పీరియడ్ చిత్రం. ఇందులో విక్కీ కౌశల్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ గా నటిస్తాడట. ఆయన భారీగా రష్మిక నటించనుంది అని బాలీవుడ్ మీడియా కథనాలు. అంటే ఆమె మహారాణి పాత్రలో దర్శనమిస్తుంది.

ఈ పాత్ర పోషించేందుకు ఆమె గుర్రపు స్వారీ, కత్తిసాము వంటి విద్యలు నేర్చుకుంటుందట.

రష్మిక ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప 2’, ‘రెయిన్ బో’ చిత్రాలు చేస్తోంది.

 

More

Related Stories