పార్టీ కావాలి విజయ్: రష్మిక

- Advertisement -
Rashmika Mandanna

హీరోయిన్ రష్మిక మందానకి విజయ్ దేవరకొండ నటించిన “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ బాగా నచ్చిందట. “మీ చేతిలో హిట్ పెట్టుకున్నారు,” అంటూ ఆమె హీరో విజయ్ దేవరకొండకి, దర్శకుడు పరశురామ్ కి ట్యాగ్ చేస్తూ బెస్ట్ విషెస్ చెప్పింది. వారిని తన డార్లింగ్స్ గా అభివర్ణించింది.

రష్మిక మందాన, విజయ్ దేవరకొండ మధ్య స్నేహం ఏర్పడడానికి కారణం “గీత గోవిందం” చిత్రం. ఆ సినిమాని తీసింది పరశురామ్. ఇప్పుడు విజయ్, మృణాల్ జంటగా పరశురామ్ తీసిన ఈ సినిమా ట్రైలర్ చూసి ఆమె చాలా ఎక్జయిట్ అయిందట.

హిట్ కళ కనిపిస్తోంది …నాకు పార్టీ కావాలి అంటూ ఆమె పోస్ట్ పెట్టింది. దానికి విజయ్ స్పందిస్తూ “క్యూట్” అంటూ రిప్లై ఇచ్చారు.

వీరు ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు అన్న గుసగుసలు చాలా కాలంగా ఉన్నాయి. కానీ వాళ్ళు ఇంతవరకు ఈ విషయంలో అఫీషియల్ గా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ విజయ్ దేవరకొండ ప్రతి సినిమాకి ఆమె బెస్ట్ విషెస్ పెడుతుంది.

 

More

Related Stories