రష్మిక ఆ వీడియో పెట్టింది అందుకే

Rashmika

హీరోయిన్ రష్మిక గోవాలో కొత్త ఏడాది 2021 సంబరాలు జరుపుకొంది. ఎంతోమంది సెలెబ్రిటీలు అక్కడికే వెళ్లి సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. అందులో విశేషం లేదు. ఐతే, రష్మిక మాత్రం కొన్ని రూమర్స్ ని ఫేస్ చేసింది తన వెకేషన్ విషయంలో. ఎందుకంటే, రష్మిక గోవా వెళ్లిన టైంలోనే విజయ్ దేవరకొండ కూడా గోవాకి బయలుదేరి వెళ్ళాడు.

రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య “సమ్ థింగ్ సమ్ థింగ్” అని చాలాకాలంగా పుకార్లు ఉన్నాయి. ఇద్దరూ వీటిని తోసిపుచ్చారు. వీటికి బ్రేక్ వేసేందుకే… ఇద్దరూ మళ్ళీ కలిసి నటించడం లేదు. విజయ్ దేవరకొండ ఇప్పటికే ఒక ఫారీన్ గాళ్ ఫ్రెండ్ తో కనిపించిన ఫోటోలు కూడా వచ్చాయి. అంటే… రష్మిక, విజయ్ మధ్య డేటింగ్ నడవడం లేదు. ఐతే, వీరిద్దరూ ఒకే టైంలో హైదరాబాద్ నుంచి గోవాకి వెళ్లడంతో మళ్ళీ ఊహాగానాలు మొదలయ్యాయి.

గోవా నుంచి రష్మిక తన అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ వీడియో చాట్ చేసింది. అప్పుడు కూడా ఆమె అభిమానులు అదే ప్రశ్న అడిగారు. “ఎవరితో న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు?” – అనేది ప్రశ్న.

అందుకే కాబోలు నిన్న రష్మిక ఒక వీడియో పోస్ట్ చేసింది. తన స్నేహితురాళ్ళతో కలిసి గోవా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియో అది. తాను గోవా వీరితో వచ్చాను, విజయ్ దేవరకొండతో కాదు అని ఇన్ డైరెక్ట్ గా చెప్పింది. పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేందుకే వీడియో.

More

Related Stories