పెద్ద సినిమాలకే రష్మిక ఓటు

రష్మిక మందాన ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా స్థిరపడింది. ఇంకా చెప్పాలంటే ఆమె పాన్ ఇండియన్ స్టార్. ఇంతకుముందు ఆమె ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే నటించేది. కానీ ఇప్పుడు తెలుగుకి సమానంగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. తమిళ్ సినిమాలు కూడా ఉన్నాయి.

ఇంతకుముందు, ఈ భామ పెద్ద సినిమాలతో పాటు మీడియం రేంజ్ సినిమాలు ఒప్పుకునేది. చిన్న హీరోల సరసన కూడా నటించేది. కానీ, ఇప్పుడు పూర్తిగా పెద్ద హీరోల చిత్రాలపైనే ఫోకస్ పెడుతోంది. ఎందుకంటే క్రేజ్ అలా ఉంది మరి.

ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ చూడండి. తమిళ సూపర్ స్టార్ విజయ్ సరసన వరిసు/వారసుడు, రణబీర్ కపూర్ తో ‘యానిమల్’, అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’. ఇవి ఆమె చేస్తున్న చిత్రాలు. ఇక తెలుగులో త్వరలో కాబోతున్న రెండు పెద్ద చిత్రాలు, తమిళ్ లో సూర్య కొత్త చిత్రం కోసం ఆమెని అప్రోచ్ అయ్యారు.

అందుకే, ఈ బ్యూటీ ఇక చిన్న చిత్రాలు, మీడియం రేంజ్ సినిమాలు చెయ్యాల్సిన అవసరం కలగడం లేదు. పెద్ద సినిమాలకు డేట్స్ ఇచ్చేందుకే ఆమె ఇబ్బంది పడే రేంజ్ లో బిజీగా ఉంది.

 

More

Related Stories