
రష్మిక ఇప్పుడు బిజీ నటి. హీరోయిన్ గా ఆమె పాపులారిటీ మరింతగా పెరిగింది ‘పుష్ప’ సినిమాతో. ఐతే, తన రేంజ్ పెరిగినా టెక్కు చూపడం లేదు. త్వరలో విడుదల కానున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా ప్రచారానికి పూర్తిగా టైం కేటాయించింది.
నిర్మాతలు కోరినన్ని డేట్స్ ఇచ్చేందుకు ఒప్పుకొంది. ఈ సినిమాకి ఇప్పటికే మంచి పాజిటివ్ బజ్ వచ్చింది.
శర్వానంద్ కి హిట్ కావాలి. అందుకే, అతను ఎక్కువ ప్రోమోట్ చేస్తున్నాడు. కానీ ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ …రష్మిక. మార్చి 4న రిలీజ్ కానున్న ఈ సినిమాకి ఆదివారం నుంచి ప్రొమోషన్ కి డేట్స్ ఇచ్చింది ఆమె.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 27 (ఆదివారం) సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్ప కళా వేధికలో వైభవంగా జరగనుంది. డైరెక్టర్ సుకుమార్, హీరోయిన్స్ కీర్తి సురేష్, సాయిపల్లవి అతిథులుగా హాజరుకానున్నారు. ఆ ఈవెంట్ తర్వాత వీడియో ఇంటర్వ్యూలు, మీడియా ఇంటరాక్షన్ వంటివి ఉంటాయి. వాటికి రెడీ చెప్పింది రష్మిక.