మళ్ళీ ఇప్పుడే కాదు: రష్మిక


రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ అదుర్స్. ‘గీత గోవిందం’ సినిమాలో ఈ జంట సూపర్ అనిపించుకొంది. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’లో కూడా కెమిస్ట్రీ పండింది. కానీ సినిమా ఆడలేదు. దాంతో, ఇద్దరూ మళ్ళీ కలిసి నటించడం ఆపారు. ఇప్పుడు రష్మిక బాలీవుడ్ కి కూడా వెళ్లి పాన్ ఇండియా స్టార్ అయింది.

మరోవైపు, ఈ జంట వెండితెరపై జంటగా కనిపించడం మానేసినా బయట మంచి కెమిస్ట్రీ చూపిస్తున్నారు. ఇటీవల వీరిద్దరూ మాల్దీవులకి కలిసి వెకేషన్ కి వెళ్లారు. ఒక హీరో, ఒక హీరోయిన్ కలిసి వెకేషన్ కి వెళ్తే ఏమంటారనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. అందుకే, ఇప్పుడు రష్మిక, విజయ్ దేవరకొండల గురించి సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతోంది.

అంతే కాదు, ఇటీవల వీళ్ళు తమ కొత్త ఫోటోలు షేర్ చేశారు. ఆ ఫోటోలు మాల్దీవుల వెకేషన్ వే. ఇద్దరూ ఒకే స్విమ్మింగ్ ఫూల్ లో జలకాలాడుతున్న టైంలో తీసిన ఫోటోలు అని అభిమానులు కనిపెట్టేశారు. దాంతో, ఈ జంట మళ్ళీ ఎప్పుడు నటించనుంది అని ప్రశ్న మళ్ళీ మొదలైంది.

Rashmika

ఈ విషయంలో రష్మిక సమాధానం ఇచ్చింది. “ప్రస్తుతం నేను చాలా ఇతర సినిమాలు చేస్తున్నాను. విజయ్ తో కలిసి నటించాలంటే ఇప్పుడు కుదరదు. వచ్చే ఏడాది కాంబినేషన్ సెట్ అవుతుందేమో చూడాలి,” అని చెప్పింది.

 

More

Related Stories