అదే నా సీక్రెట్: రష్మిక

- Advertisement -
Rashmika


రష్మిక మందాన చాలా ఫిట్ గా ఉంటుంది. అందాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ శారీరక శ్రమ చెయ్యాలి. అదే సూత్రాన్ని ఆమె పాటిస్తోందట.

“ప్రతిరోజూ ఎక్సర్ సైజ్ చెయ్యాలి. క్రమం తప్పకూడదు. కన్సిస్టెన్సీ ముఖ్యం. అదే నా సీక్రెట్. తప్పని పరిస్థితుల్లో తప్ప నేను ఎప్పుడూ స్కిప్ చెయ్యను,” అని చెప్పింది ఈ భామ.

ఈ అమ్మడు గతంలో వర్కవుట్ ల విషయంలో పెద్దగా సీరియస్ గా ఉండేది కాదట. కానీ, సినిమా ఇండస్ట్రీలో ఇతర నటీనటుల శ్రమపడే విధానాన్ని చూసి ఆమె స్ఫూర్తి పొందిందట. ఒక్కసారి జిమ్మింగ్ అలవాటు అయితే వదలం అని కూడ చెప్తోంది. ఐతే, ఎక్కువ సేపు జిమ్ లో ఉండదట. తక్కువ టైంలో ఎక్కువ వర్కౌట్స్ చెయ్యడం వల్ల మంచి ఫలితం వస్తుందని గ్రహించింది.

హైదరాబాద్ లో ఆమెకి ప్రత్యేక ట్రైనర్ ఉన్నాడు.

పాతికేళ్ల ఈ సుందరి త్వరలోనే రెండు కొత్త సినిమాలు ప్రకటించనుంది. ప్రస్తుతం ఆమె ‘పుష్ప 2’కి రెడీ కానుంది. ఇటీవల ఆమె నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా ఆడలేదు.

 

More

Related Stories