
“యానిమల్” చిత్రాన్ని రణబీర్ కపూర్, రష్మిక జోరుగా ప్రచారం చేస్తున్నారు. తెలుగులో కూడా వారి ప్రచారం మామూలుగా లేదు. ఇప్పటికే రెండు సార్లు ఈ సినిమాని తెలుగునాట ప్రచారం చేశాడు రణబీర్. ఇక ఈ రోజు (నవంబర్ 27) హైదరాబాద్ లో భారీ ఎత్తున ఈవెంట్ కూడా నిర్వహించారు.
“రణబీర్ కపూర్ అద్భుతమైన నటుడు. వ్యక్తిగా కూడా అద్భుతమే. ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. ముఖ్యంగా కుటుంబానికి ఆయన ఇచ్చే ప్రాధాన్యం బాగా నచ్చింది. కుటుంబ సభ్యులు, తన మిత్రులపైనే కాదు తన అభిమానులపై ఆయన చూపే ప్రేమ కూడా జెన్యూన్ గా ఉంటుంది. నేను కూడా అలా ఉండాలి అని నేర్చుకున్నాను,” అని తాజాగా హైదరాబాద్ మీడియాతో పేర్కొంది రష్మిక.
ఈ సినిమాలో ఆమె గీతాంజలి అనే పాత్ర పోషించింది. ఈ పాత్ర తనకు మంచి పేరు తెస్తుంది అని చెప్తోంది రష్మిక.
డిసెంబర్ 1న విడుదల కానుంది “యానిమల్.” సందీప్ వంగా తీసిన ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నారు.