అబ్బా ఏమి సెప్పింది!

Rashmika

రష్మిక మందాన హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉంది. ‘పుష్ప’ వంటి భారీ తెలుగు చిత్రంతో పాటు హిందీలో రెండు సినిమాలున్నాయి. యూత్ లో ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక అసలు మ్యాటర్లోకి వస్తే… ఈ లాక్డౌన్ సందర్భంగా ఆమె తన అభిమానులకు, ఫాలోవర్స్ కి కొన్ని సూక్తులు చెప్తోంది.

మనకు జీవితంలో నిజంగా ఏది అవసరమో తెలుసుకొండి అని రష్మిక ఒక ముచ్చట చెప్పింది. అదేంటో చూడండి….

” నా ఫ్రెండ్ చెప్పిన ఒక మంచి మాట మీకందరికి చెప్పాలి. మీ సమయాన్ని మీకు ఆనందాన్ని ఇచ్చే దానిపైనే పెట్టండి. లేదా మీకు డబ్బు తెచ్చిపెట్టే లేదా జ్ఞానం ఇచ్చేదానిపైనో వెచ్చించండి. మిగతాదేదైనా అనవసరం.” ఇది రష్మిక ఇచ్చిన సలహా. ఈ మాత్రం మాకు తెలియదా అని ట్రోలింగ్ షురూ అయింది.

More

Related Stories