
రష్మిక మందాన ఇప్పుడు బాలీవుడ్ లో సెటిల్ అయ్యే ఆలోచనలో ఉంది. అక్కడ ఆదాయం ఎక్కువ ఉంది ఈ భామకి. ఇప్పటికే మకాం ముంబైకి మార్చింది. హైదరాబాద్ లో పని ఉన్నప్పుడు మాత్రమే వస్తోంది. తాజాగా తన మొదటి హిందీ చిత్రం ‘గుడ్ బై’ ప్రొమోషన్ కోసం చాలా కష్టపడుతోంది. దేశమంతా తిరుగుతోంది.
ఈ ప్రమోషన్ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను సంకోచం లేకుండా మాట్లాడుతోంది.
“అవును… నేను లవ్ లో ఫెయిల్ అయ్యాను. మూడు, నాలుగు సార్లు ప్రేమలో పడ్డా. కొన్ని నా వల్ల బ్రేకప్ అయ్యాయి. మరికొన్ని వాళ్ళ వల్ల. కారణాలు ఏమైనా మాజీ బాయ్ ఫ్రెండ్స్ తో శత్రుత్వం లేదు. ఇప్పటికీ వారితో ఫ్రెండ్లిగా ఉంటాను,” అని చెప్పింది. ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ గురించి కూడా చెప్పింది.
‘గుడ్ బై’ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ లోపు ఇంకా ఎన్ని విషయాలు బయట పెడుతుందో.