ఒకబ్బాయితో అర్థరాత్రి రష్మిక

రష్మిక చేసే అల్లరి పనులకు అంతులేకుండా పోతోంది. ఆన్ లైన్ లో ఆమె చేసే చిలిపి పనులు కొందర్ని నవ్విస్తాయి, మరికొందర్ని కవ్విస్తాయి, ఇంకొందరికి కోపం తెప్పిస్తాయి. ఎవరు ఎలా ఫీల్ అయినా రష్మిక మాత్రం తన మనసులో భావాల్ని ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంటుంది. తాజాగా ఓ ఫన్నీ స్టేట్ మెంట్ ఇచ్చి అందర్నీ ఎట్రాక్ట్ చేసింది ఈ బ్యూటీ.

అర్థరాత్రి.. ముగ్గురు అమ్మాయిలు.. ఒకబ్బాయి అంటూ క్యాప్షన్ పెట్టింది రష్మిక. ఈ క్యాప్షన్ చూసి చాలామంది కంగారు పడ్డారు. కానీ అక్కడ విషయం వేరు. తన ఇద్దరు ఫ్రెండ్స్, తన పెట్ డాగ్ తో కలిసి రష్మిక దిగిన ఫొటో అది. అందులో అబ్బాయి అంటే ఆ కుక్క. మిగతా ముగ్గురు అమ్మాయిలు. ఫొటో దిగింది అర్థరాత్రి వేళ. అదీ రష్మిక స్టేట్ మెంట్ కు అర్థం.

ఇలా ఫన్నీ స్టేట్ మెంట్స్, వెరైటీ ఫొటోలు పెట్టడం రష్మికకు కొత్త కాదు. ఈ పిక్ పెట్టిన కొన్ని గంటలకే బీచ్ లో, మట్టిలో ఎక్సర్ సైజులు చేసే వీడియో పెట్టి అందర్నీ ఎట్రాక్ట్ చేసింది ఈ కన్నడ కస్తూరి.

Related Stories