రష్మికకి రాజయోగం ఉందా?


రష్మిక జీవితంలో ఎన్నో మలుపులున్నాయి. హీరోయిన్ గా మొదటి సినిమాతోనే పేరు వచ్చింది. ఆ వెంటనే కన్నడ హీరో, దర్శకుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్ మెంట్ జరిగింది. పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిన తర్వాత బ్రేకప్ చెప్పుకొంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలు చేసి మరింత పాపులర్ అయింది.

‘సరిలేరు నీకెవ్వరు’, ‘పుష్ప’ చిత్రాలతో తెలుగులో పెద్ద హీరోయిన్ గా స్థిరపడింది అనుకుంటున్న టైంలో ఆమెకి బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. హిందీలో ఆమెకి మూడు సినిమాలు ఉన్నాయి. తమిళంలో విజయ్ సరసన పెద్ద చిత్రం ఒకటి సెట్స్ పై ఉంది. ఇలా ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగింది.

ఇక వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఆలిండియా సూపర్ స్టార్ అవుతుంది అనుకుంటుంటే… ఆమె త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెడుతుంది అనే మాట వినిపిస్తోంది.

రక్షిత్ శెట్టితో ఆమె బ్రేకప్ చెప్తుంది అనే జోస్యం చెప్పిన ఒక స్వామి ఇప్పుడు ఆమె పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతున్నారు. రష్మిక త్వరలోనే కర్ణాటక రాజకీయాల్లోకి అడుగుపెడుతుంది అని బల్లగుద్ది చెప్తున్నారు.

మరి, ఆయన జోస్యం నిజమవుతుందా? ఆమెకి మంత్రి పదవో, మరేదైనా పదవి లభిస్తుందా? ఆమెకి రాజయోగమో రాణియోగమో ఉందా?

 

More

Related Stories