బ్రేక్ ఇచ్చిన హీరోకే షాక్ ఇచ్చింది

Rashmika

నాగశౌర్య-రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఛలో’. తెలుగులో రష్మికకు మొదటి సినిమా ఇదే. అలా తొలి సినిమా సక్సెస్ తో కెరీర్ లో అంచెలంచెలుగా ఎదుగుతూ, ప్రస్తుతం స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది ఈ కన్నడ బ్యూటీ. 

కట్ చేస్తే, కొన్ని రోజుల కిందట ఇదే హీరో ఓ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. దర్శకుడు తప్ప దాదాపు ‘ఛలో’ టీమ్ అంతా కలిసింది. సినిమాటోగ్రాపర్, సంగీత దర్శకుడు, బ్యానర్.. ఇలా అంతా ‘ఛలో’ సెటప్ తోనే రెడీ చేస్తున్నారు. కాబట్టి సెంటిమెంట్ గా హీరోయిన్ ను కూడా రిపీట్ చేయాలనుకున్నారు. సరిగ్గా ఇక్కడే రష్మిక షాక్ ఇచ్చింది.

నాగశౌర్య-అనీష్ కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ రోల్ కోసం రష్మికను సంప్రదిస్తే, ఆమె నో చెప్పినట్టు తెలుస్తోంది. కథ నచ్చక ఆమె నో చెప్పిందా లేక రెమ్యూనరేషన్ సెట్ అవ్వలేదా అనేది సస్పెన్స్.

అదే టైమ్ లో ఆమె శర్వానంద్ హీరోగా ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాకు డేట్స్ ఇచ్చింది. ఈ సినిమా కోసం ఆమె కెరీర్ లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ ను అందుకుంటోంది.

Related Stories