రష్మిక… ఏంటమ్మా నీ బాధ!

rashmika badha news

హీరోలకు టెన్షన్ లేదు. వాళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు సెట్స్ పైకి రావొచ్చు. వాళ్లు చెప్పిందే వేదం. కానీ హీరోయిన్ల పరిస్థితి అలా కాదు. వాళ్లంతా ఇప్పుడు అభద్రతాభావంలో పడిపోయారు. సినిమా స్టార్ట్ అవ్వకపోతే ఎక్కడ ఆ అవకాశం తమ చేజారిపోతుందా అనే భయం అందర్లో కనిపిస్తోంది. స్టార్ హీరోయిన్ల నుంచి అప్ కమింగ్ హీరోయిన్ల వరకు అందరిలో ఇదే టెన్షన్.

బహుశా ఇదే ఫీలింగ్ హీరోయిన్ రష్మికకు కూడా ఉన్నట్టుంది. పైకి చెప్పకపోయినా సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న పోస్టులు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ఏ పోస్ట్ పెట్టినా, అందులో సెట్స్ మిస్సవుతున్నానని, షూటింగ్ మిస్సవుతున్నానని పెడుతూ వస్తోంది.

ఫొటో షూట్స్ చేయకుండా ఉండలేకపోతున్నానని, ఇంట్రెస్టింగ్ కాస్ట్యూమ్స్ వేసుకోకుండా ఆగలేకపోతున్నానని, సెట్స్-కారవాన్ ను దారుణంగా మిస్సవుతున్నానని.. ఇలా రకరకాలుగా పోస్టులు పెడుతోంది రష్మిక.

ఏదేమైనా రష్మిక లాంటి హీరోయిన్లు చాలామంది ఇప్పుడు కోరుకుంటోంది ఒకటే. షూటింగ్స్ మొదలవ్వాలి, చేతి నిండా పని ఉండాలి.

Related Stories