
ఈ రోజుల్లో ముద్దు సీన్లు చాలా కామన్ అయిపోయాయి. యువ హీరోల సినిమాల్లో అవి మస్ట్. ఇక బాలీవుడ్ లో రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ వంటి హీరోల చిత్రాల్లో ఏ హీరోయిన్ నటించినా ముద్దు సీన్లు చెయ్యాల్సిందే. పెళ్లి తర్వాత కూడా అలియా భట్ రణవీర్ సింగ్ తో ముద్దు సీన్లు చేసింది.
ఇప్పుడు రష్మిక మందానతో రణబీర్ కపూర్ ముద్దుల తుఫాన్ సృష్టించాడు. ఈ రోజు (అక్టోబర్ 11) విడుదలైన “అమ్మాయి” అనే సాంగ్ లో రణబీర్, రష్మికల ముద్దులు మెయిన్ హైలెట్. రష్మిక తెలుగులో “డియర్ కామ్రేడ్” వంటి సినిమాల్లో హాట్ హాట్ కిస్ సీన్లు చేసింది. కానీ, “యానిమల్” చిత్రంలో మాత్రం ఆమె కిస్ సీన్లని కొత్త రేంజ్ కి తీసుకెళ్లింది అనే చెప్పాలి.
ALSO READ: ‘Ammayi’ song has Ranbir and Rashmika’s kiss sequence
రష్మిక మందాన ఇంతకుముందు బాలీవుడ్ లో “గుడ్ బై”, “మిషన్ మజ్ను” వంటి చిత్రాలు చేసింది. ఐతే, ఆమె బాలీవుడ్ కెరీర్ లో “యానిమల్” పెద్ద చిత్రం. “అర్జున్ రెడ్డి” దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు భారీ హిట్ అయితే రష్మిక మందాన బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ల లిస్ట్ లోకి చేరిపోతుంది. అందుకే సినిమాపై గట్టి నమ్మకంతో ఉంది.

ఇక తెలుగులో ఆమె అల్లు అర్జున్ సరసన “పుష్ప 2” చేస్తోంది. త్వరలోనే ధనుష్ సరసన శేఖర్ కమ్ముల డైరెక్షన్లో కూడా నటించనుంది. ఈ సినిమాల్లో మాత్రం ముద్దు సీన్లు ఉండవు. అల్లు అర్జున్ కిస్ సీన్లు చెయ్యడు. దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా అంత హాట్ హాట్ కిస్ సీన్లు చిత్రీకరించరు.