రష్మిక లెక్కలు ఇవే!

రష్మిక బాలీవుడ్ బాట పట్టడం ఒక విధంగా చెప్పాలంటే పెద్ద సర్ప్రైజ్. రష్మిక “బాలీవుడ్ కి సూట్” అయ్యే భామ కాదనే ఇంప్రెషన్ ఉంది. ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా రష్మిక బాలీవుడ్ ఆలోచనలు లేవని చెప్పింది. మరి సడెన్ గా ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా సరసన “మిషన్ మజ్ను” అనే సినిమా ఎలా ఒప్పుకొంది?

సినిమా కథ ప్రకారం సౌత్ ఇండియన్ భామ కావాలి అట. దాంతో పలువురు హీరోయిన్ల పేర్లని షార్ట్ లిస్ట్ చేస్తున్నప్పుడు… రష్మిక బెస్ట్ ఛాయస్ అని ఆ సినిమా డైరెక్టర్ కి అందరూ చెప్పారట. “సరిలేరు నీకెవ్వరు”, “గీత గోవిందం” సినిమాలు చూసిన తర్వాత దర్శకుడు కూడా రష్మిక కరెక్ట్ గా ఉంటుంది అని భావించాడట.

రష్మిక కూడా వెంటనే అంగీకరించింది. ఎందుకంటే… బాలీవుడ్ మూవీ చేస్తే తనకి కూడా పాన్ ఇండియా మార్కెట్ పెరుగుతుంది. యాడ్స్ బాగా వస్తాయి. అందుకే, వెంటనే సైన్ చేసిందట. ఆమె లెక్కలు ఆమెవి. మార్కెట్ పెంచుకోవడమే ఆమె లక్ష్యం.

ఇప్పటికే మాతృ భాష కన్నడంలో నటించింది. తమిళ్ లో కూడా అడుగుపెట్టింది. ఆమె నటించిన మొదటి తమిళ చిత్రం (కార్తీ సరసన “సుల్తాన్” నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. తెలుగులో ఆల్రెడీ టాప్ హీరోయిన్. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అంతో, ఇంతో పేరు వస్తే… ఆమెకి పాన్ ఇండియా మార్కెట్ పెరుగుతుంది. అది ఆమె లెక్క.

Advertisement
 

More

Related Stories