
రష్మిక తన అభిమానులకు ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేసింది. తనని చూసేందుకు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయొద్దని వేడుకుంటోంది. అది తనకు బాధ కలిగిస్తుందని చెప్తోంది రష్మిక
ఇటీవల రష్మికని చూసేందుకు తెలంగాణాకి చెందిన ఒక అభిమాని కర్ణాటకలోని ఆమె ఇంటికి వెళ్ళాడు. లాక్డౌన్ లో ఆమెతో ఫోటో దిగాలని ప్రయత్నించాడు. ఐతే, అనుమానంగా తచ్చాడుతున్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొని అతన్ని మళ్ళీ హైదరాబాద్ ట్రైన్ ఎక్కించారు.
ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న రష్మిక తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. “దయచేసి అలాంటి పనులు చేయొద్దు. నాకు ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. అతన్ని కలవకలేక పోయినందుకు బాధగా ఉంది. భవిష్యత్ లో కలుస్తానని అనుకుంటున్నా. కానీ రిస్క్ తీసుకోవద్దు,” అని రష్మిక పేర్కొంది.
బాలీవుడ్ లో రష్మిక రెండు సినిమాల్లో నటిస్తోంది. అందుకే ముంబైకి మకాం మార్చింది. అక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకొంది.