బాలీవుడ్ లో రెండో సినిమా షురూ

Rashmika


రష్మిక నటించిన తొలి తమిళ చిత్రం … సుల్తాన్. అది ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. ఇదే రోజు… రష్మిక ఒప్పుకున్న రెండో బాలీవుడ్ మూవీ కూడా లాంఛనంగా షురూ అయింది. రష్మిక తొలి బాలీవుడ్ మూవీ సెట్ పై ఉండగానే రెండో మూవీ సైన్ చెయ్యడం, అది స్టార్ట్ కావడం విశేషమే.

రష్మిక రెండో బాలీవుడ్ మూవీ పేరు.. ‘గుడ్ బై’. అమితాబ్ బచ్చన్ మెయిన్ హీరో. రష్మిక కీలక పాత్ర పోషిస్తోంది. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ మూవీ షురూ అయింది. రష్మిక నటిస్తున్న ఫస్ట్ బాలీవుడ్ మూవీ… మిషన్ మజ్ను. సిద్దార్ట్ మల్హోత్రా. ఈ మూవీ షూటింగ్ సాగుతోంది.

ఇక తమిళ్ లో ఆమె నటించిన ‘సుల్తాన్’లో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. కూరలో కరివేపాకులాంటి రోల్. ఆమెని అందంగా చూపించనూ లేదు. నటించే స్కోప్ ఇవ్వలేదు. కోలీవుడ్ లో బాడ్ డెబ్యూ.

More

Related Stories