సమంతలా రష్మిక మందాన!

Rashmika

‘పుష్ప’ సినిమా టీజర్ చూసిన వారందరికీ ఈ సినిమాలో రష్మిక పాత్ర గురించి క్లారిటీ వచ్చేసి ఉంటుంది.

‘పుష్ప’ సినిమాని ‘రంగస్థలం’ ఫార్మాట్ లోనే తీస్తున్నాడు సుకుమార్. కథ జరిగేది పాతిక సంవత్సరాల క్రితం. అడవుల నేపథ్యంలో స్టోరీ. హీరో అల్లు అర్జున్ సినిమా ఆసాంతం రగ్గుడ్ లుక్ లోనే కనిపిస్తాడు. ‘రంగస్థలం’లో రామ్ చరణ్ పూర్తిగా 80ల నాటి పల్లెటూరి యువకుడిగానే నటించాడు. హీరోయిన్ సమంతది కూడా డీగ్లామర్ రోల్.

‘పుష్ప’లో కూడా రష్మిక సేమ్ అలాగే కనిపించనుంది. ఆమెది పల్లెటూరి యువతి పాత్రే. రష్మిక ఇటీవలే ‘సుల్తాన్’ సినిమాలో అలాగే కనిపించింది.

రష్మిక, బన్నీ కాంబినేషన్లో ఇదే మొదటి సినిమా. సుకుమార్ ఈ సినిమాని ‘రంగస్థలం’ ఫార్మాట్ లోనే గ్రాండ్ గా తీస్తున్నాడట. పాటలు అదిరిపోతాయని అంటున్నారు.

More

Related Stories