రష్మిక ఫేక్ ఫోటో వైరలైందిగా

- Advertisement -

‘పుష్ప’ సినిమాలో రష్మిక మందాన పాత్ర కీలకం. హీరోకి ప్రియురాలిగా ఉండడమే కాదు కథలో కీలకమైన మలుపులు కారణం ఆమె పాత్ర. ఐతే, ఆ సినిమాలో రష్మికని హీరో అల్లు అర్జున్ పెళ్లి చేసుకుంటున్నట్లు చూపిస్తారు. అలా మొదటి భాగం ముగుస్తుంది.

హీరోకి పెళ్లి అయ్యాక రెండో భాగంలో ‘రొమాన్స్’కి ఎంతవరకు స్కోప్ ఉంటుంది అనేది డౌట్ చాలా మందిలో కలుగుతోంది. అందుకే, మరో హీరోయిన్ పాత్రని కూడా సృష్టించారు అనే ప్రచారం మొదలైంది. దానికి తోడు, రెండో భాగంలో (పుష్ప 2) మొదటి అరగంటలోనే ఆమె పాత్ర చనిపోతుంది అనే పుకారు ఊపందుకొంది.

అంతే కాదు, రష్మిక చనిపోయిన సీన్లు ఇటీవల సుకుమార్ చిత్రీకరించారని చెప్తూ ఒక ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేశారు కొందరు. కానీ అది ఫేక్ ఫోటో. ఒక మరాఠీ సినిమాలో రష్మికని పోలిన నటి డెత్ కి సంబంధించిన ఫోటోని ‘పుష్ప 2’లో సన్నివేశం అంటూ వైరల్ చేశారు.

“పుష్ప 2″లో మరో హీరోయిన్ ఉండదు అని ఇప్పటివరకు ఉన్న సమాచారం. అల్లు అర్జున్ భార్యగా రష్మిక కనిపిస్తుంది. వీరి మధ్యే మరో రెండు డ్యూయెట్లు ఉంటాయట.

 

More

Related Stories