- Advertisement -

రవీనా టాండన్ మంచి జోష్ లో ఉంది. “కేజీఎఫ్ 2” భారీ విజయం సాధించి ఆమెకి ఒక్కసారిగా క్రేజ్ తెచ్చింది. ఒకప్పుడు ఆమెకి చాలా క్రేజ్ ఉండేది. కానీ, నేటి తరానికి ఆమె పెద్దగా తెలియదు. “KGF2″తో ఇప్పుడు దేశమంతా ఆమె పేరు మార్మోగుతోంది. నేటి తరం ప్రేక్షకులకు కూడా ఆమె చేరువైంది.
ఇకపై, రవీనా టాండన్ కి పవర్ ఫుల్ క్యారెక్టర్లు వస్తాయి అనడంలో సందేహం లేదు. అందులో మన తెలుగు దర్శక, నిర్మాతలు ముందుంటారు.
కెరీర్ కి మళ్ళీ మంచి ఊపు రావడంతో ఆమె వరుసగా పార్టీలు చేసుకొంటోంది. ఆమె మిత్రురాలు, హైదరాబాద్ కి చెందిన పేజ్ 3 సెలెబ్రిటీ పింకీ రెడ్డి పెద్ద పార్టీ ఇచ్చింది. ఆ పార్టీలో రవీనా టాండన్ మిత్రురాళ్లు ఫుల్లుగా డ్యాన్స్ చేశారు. ఆ వీడియోని ఆమె ఆనందంగా షేర్ చేసింది.
ఆ వీడియోపై ఓ లుక్కెయ్యండి…